Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య లక్షణాలు జాగ్రత్తలు

ఈ రోజుల్లో గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య లేనివారు అతి తక్కువ మంది. దీనికి గల ముఖ్య కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక యంత్రాలతో పరిగెడుతూ వేళకు ఆహారం తీసుకోక, ఒక వేళ అహారం తీసుకున్నా క్షణాలలో హడావిడిగా ముగించటం, దీనితో పాటుగా తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా
నిద్రపట్టక పోవడం, ఆలోచనలతో మనసు నిలకడ లేకుండా పరిగెత్తడం, కారణం లేకుండానే కోపం రావటం వంటి మానసిక సమస్యలతో బాటు సరైన అహారం తీసుకోక పోవటంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి అందరిని వేధిస్తోంది.

లక్షణాలు:


గ్యాస్‌తో పొట్ట అంతాఉబ్బరంగా ఉండి పొట్టలో గడబిడలు మొదలవుతాయి.


తేన్పులు ఎక్కువగా రావడం.


తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక కడుపునొప్పి రావటం.


మలబద్దకం ఏర్పడటం.


జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావటం.


వాంతులు అవడం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు మానసిక స్థాయిలో కోపం, చిరాకు, నిద్రలేమి, నిరాసక్తత ఉండి అంతర్మధనం చెందుతారు.


చికిత్స:


వ్యక్తి శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా హోమియో మందులను ఎంపిక చేసి ఇవ్వడం వల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.


మందులు:


కార్బోవెజ్‌ : గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్న వారికి ముందుగా ఆలోచించదగిన మందు. పొట్ట పైభాగం గ్యాస్‌తో ఉబ్బి ఉంటుంది. పొట్ట పైభాగాన నొప్పి, మంట వస్తుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత బాధలు ఎక్కువ అవుతాయి. జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో తరుచుగా బాధ పడేవారికి ఈ మందు ప్రయోజనకారి. వీరికి తేన్పులు ఉపశమనం కలిగిస్తాయి.


చైనా : పొట్ట మొత్తం ఉబ్బరంగా ఉండి బెలూన్‌లాగా ఉంటుంది. వీరికి తేన్పులు వచ్చినా ఉపశమనం కలుగదు కాని అపానవాయువు పోతే మాత్రం ఉపశమనం ఉంటుంది. ఈ రోగులు నీరసంగా ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఆలోచించగింది.


నక్స్‌వామిక : మసాలాలు, ఫాస్ట్‌పుడ్స్‌ ,కాఫీలు ఎక్కువగా సేవించడం, శరీరక శ్రమ తక్కువగా ఉండి మానసిక శ్రమ ఎక్కువగా ఉన్న వారికి ఈ మందు ముఖ్యమైంది. వీరు

మానసిక స్థాయిలో కోపం, ఎక్కువ శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలతో పాటుగా గ్యాస్‌ సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఈ మందు పనిచేస్తుంది.

అర్జెంటు నైట్రికం : పొట్టలో నొప్పి ఉండి, తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమై బాధకలుగుతుంది. వీరు మానసిక స్థాయిలో తేలికగా ఆందోళనకు గురవుతుంటారు. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఎదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు.


ఈ మందులే కాకుండా లైకోపోడియా, పాస్ఫరస్‌, నైట్రమ్‌ఫాస్‌, ఎనాకార్డియం, సల్ఫర్‌, అర్సినికం ఆల్బం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే మంచి ఫలితం ఉంటుంది.







జాగ్రత్తలు:

1. మసాలలు, వేపుళ్లు, ఆయిల్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌పుడ్స్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ మానివేయాలి.


2. వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్ళు సరిపడినంతగా త్రాగాలి.


3. నిల్వఉంచిన పచ్చళ్ళు తినడం మానివేయాలి.


4. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని నివారించటానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.


5. ప్రతి రోజు విధిగా వ్యాయామం చేయాలి.


6. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా వెజిటెబుల్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.


7. టీ, కాఫీలు మానివేయాలి.


Yorum Gönder

0 Yorumlar